సోషల్ మీడియాలో చెక్కర్లు కొడ్తున్న జగన్ వాచ్

సోషల్ మీడియాలో చెక్కర్లు కొడ్తున్న జగన్ వాచ్

ప్రమాణ స్వీకారానికి వైస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు లేనివిధంగా తనచేతికి వాచ్ పెట్టుకుని కనిపించారు. మరి ఆ వాచ్ ఎవరిచ్చారు. ఆ వాచ్ ఎంత ఖరీదు చేసిందో ఒకసారి తెలుసుకుందామా ?.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ వాచ్ పెట్టుకుని ఉన్న సంఘటనలు మనం చాలానే చూసాము. ఆయన రెండో సారి సీఎం అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా హెలిచాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం మనందరికీ తెలిసిందే. ఆ క్రమంలో మృతులకు సంబంధించిన వస్తువులను వారి బంధువులకు ఇవ్వడం అనవాయితీ.

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనక కుట్ర ఉందని భావించిన వైఎస్ జగన్ సీబీఐ విచారణను కోరడం జరిగింది. ఆ తరుణంలో సీబీఐ అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించి ఏవైన ఆధారాలు తెలుస్తాయో అని ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన అన్ని వస్తువులు కాలిబూడిదయ్యాయి. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతికి ఉన్న వాచ్ లో కొన్ని భాగాలు ఉండటంతో వాటిని జగన్ కావాలని అడిగారు అని.. వాళ్లు ఇచ్చారు అని నెటిజన్లు అంటున్నారు. ఆ పాడైన వాచ్ ను బాగుచేయించుకుని తన తండ్రి గారి గుర్తుగా ఉంటుందని అలాగే వాచ్ తన చేతికి ఉంటే తన తండ్రి కూడా తనతో పాటు ఉన్నట్లు ఉంటుందని ఎన్నడూ లేని విధంగా జగన్ ఆ వాచ్ ను పెట్టుకున్నారని వాచ్ తో ఉన్న జగన్ ఫోటోను సోషల్ మీడియా లో నెటిజన్లు షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అది అలాఉంటే మరి ఈ వాచ్ వెనకన ఉన్న అసలు కారణం ఏమిటిఅనేది జగన్ కే తెలియాలి అని మరికొందరు కామెంట్లు చేస్తోన్నారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram