ఇక వచ్చేనా అమెరికా వీసా ??

ఇక వచ్చేనా అమెరికా వీసా ??

అమెరికా వెళ్ళాలి అని అనుకుంటున్నారా అయితే మీ సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలు తప్పక చెప్పాల్సిందే. అమెరికాలో కొత్త వీసా నిబంధనలు అమలులోకి వచ్చాయి. అక్కడికి వచ్చే అత్యధిక విదేశీయుల్లో ఉగ్రవాదులు, ప్రమాదకర వ్యక్తులను గుర్తించడానికి ఈ కొత్త వీసా విధానాన్ని ఆ దేశ విదేశాంగశాఖ శనివారం రోజు ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఇకపై తాత్కాలిక టూరిస్టులు కూడా వీసా దరఖాస్తులో తమ వ్యక్తిగత సమాచారంతో పాటు డ్రాప్‌డౌన్ మెనూలో ఉన్న సోషల్ మీడియా వివరాలు తప్పకుండ వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ సామాజిక మాధ్యమాలను వినియోగించకపోతే ఆ విషయాన్ని అక్కడ తెలపాలి. అయితే సోషల్ మీడియా వినియోగంపై తప్పుడు డీటెయిల్స్ ఇచ్చినవారు కఠినమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగశాఖ అధికారి హెచ్చరించారు.

 

ప్రస్తుతం ఉన్న అమెరికా ఆన్‌లైన్ వీసా దరఖాస్తులో కొన్ని మేజర్ సోషల్ మీడియాలు మాత్రమే ఉన్నాయని, త్వరలో అక్కడ అన్ని సోషల్ మీడియా వివరాలను అందులోకి వస్తాయి అని అన్నారు. కొత్త నిబంధనల సూచనా మేరకు ఐదేండ్ల ఈ-మెయిల్స్ రిపోర్ట్, ఫోన్ నెంబర్లను కూడా వాటితో జత చెయ్యాలిఅని చెప్పారు. వర్క్ మరియు స్టడీ వీసాదారులందరికీ ఇదే వర్తిస్తుందని, అధికార, ద్వైపాక్షిక వీసాలకు మాత్రం ఇది మినహాయింపు ఉంటుందని చెప్పా రు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram