తొలిసారి సమావేశమైన ఏపీ కేబినెట్ ఆ 8 అంశాలపైనా కీలక చర్చ

తొలిసారి సమావేశమైన ఏపీ కేబినెట్ ఆ 8 అంశాలపైనా కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలిసారిగా ఈరోజు ప్రొదున్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకంగా 8 అంశాలపై చర్చ జరిగింది. ఏపి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయా శాఖల నుంచి ఈ 8 అంశాలపై సమాచారాలను సేకరించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం తరువాత తన తొలి సంతకం చేసిన పింఛనును రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు వరకూ పెంచే క్రమంలో మొదటివిడతగా రూ250 పెంచిన పథకానికి ఈరోజు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా ఆశావర్కర్ల వేతనాలను రూ. 3 వేల నుంచి రూ 10 వేల వరకు పెంచుతూ సంతకం చేశారు.

 

ఈ సంవత్సరం అక్టోబరు నుండి అమలు కానున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ. 12,500 చెల్లించే పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించేందుకు అనుమతించనుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ రద్దు, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం, హోంగార్డుల జీతాల పెంపు, పారిశుద్య కార్మికుల జీతాలు పెంపుపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram