పాదాభివందనం చేయబోయిన వైస్ జగన్ ఆపేసిన మోదీ

పాదాభివందనం చేయబోయిన వైస్ జగన్ ఆపేసిన మోదీ

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదాభివందనం చేయబోయారు. ఈరోజు (ఆదివారం) సాయంత్రం తిరుపతి పర్యటనకు విచ్చేసిన మోదీ. శ్రీలంక రాజధాని కొలంబో అక్కడ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. గవర్నర్ తరవాత మోదీకి స్వాగతం పలికిన జగన్మోహన్ రెడ్డి ప్రధాని కాళ్లు మొక్కబోయారు. కానీ, మోదీ జగన్‌ను ఆపారు. ఆయనతో ఏదో మాట్లాడి భుజం తట్టారు. అయినప్పటికీ మరల ప్రధాని కాళ్లు మొక్కడానికి జగన్ రెండోసారి ప్రయత్నం చేసారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram