శభాష్ సీఎం వైస్ జగన్

శభాష్ సీఎం వైస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే ఆదర్శ రాష్ష్రంగా తీర్చిదిద్దుతానన్న జగన్ ఆ దిశగానే బాటలు వేస్తున్నారు. మే-30న సీఎంగా ప్రమాణం చేయబోతున్న ఆయన ..ఈ కార్యక్రమాన్ని చాలా సాధారణంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సొమ్మును వృధా చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను ఈ ప్రోగ్రాంకి ఎంత ఖ‌ర్చు అవుతుంద‌ని జ‌గ‌న్ అడిగితే.. క‌నీసం 5 నుంచి 10 ల‌క్ష‌ల మ‌ధ్య అవుతుంద‌ని ఎల్వీ చెప్పార‌ట‌.

దాంతో జ‌గ‌న్ అలా అవ‌డానికి వీలులేదు. రూ. 2 ల‌క్ష‌ల‌కు ఎక్కువ అవ్వకుండా ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడని వైసీపీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి విజ‌య‌వాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ స్టేడియం ఎలాగో ప్ర‌భుత్వానిదే కాద.. కుర్చీల‌ను మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తుంది. వ‌చ్చే వారికి ప్ర‌భుత్వ అతిధి గృహాల్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఎక్క‌డిక‌క్క‌డ ఖర్చులను త‌గ్గించుకునేందుకు జ‌గ‌న్ వేస్తున్న అడుగులు చూసి విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram