వైఎస్ జగన్ సరికొత్త రికార్డు

వైఎస్ జగన్ సరికొత్త రికార్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్ సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వారిలో జగన్ మూడో పిన్న వయస్సుడిగా రికార్డు నెలకొల్పబోతున్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 1972, డిసెంబర్ 21న జన్మించారు. ఇప్పుడు జగన్ వయస్సు 46 సంవత్సరాల 6 నెలలు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని , నవ్యాంధ్రలో గాని ఇదివరకు అత్యంత పిన్న వయస్సులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రికార్డు దామోదరం సంజీవయ్య పేరున ఉంది. అప్పుడు అతని వయస్సు 38 సంవత్సరాల 11 నెలలు. ఆ తర్వాతి రికార్డు నారా చంద్రబాబు నాయుడు పేరున ఉంది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయానికి అతని వయస్సు 45ఏళ్ల 5 నెలలు. తాజా ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్ పిన్న వయస్కుల జాబితాలో చంద్రబాబు తర్వాత జగన్ ఉండబోతున్నారు….

 

మ‌రింత స‌మాచారం కోసం సైన్ అప్ అవ్వండి

 

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram