విజయవాడకు వైస్సార్ జగన్‌ మోహన్‌ రెడ్డి

విజయవాడకు వైస్సార్ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు మే 23న వెలువడనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. మరొకవైపు పార్టీల అధినేతలు ఆయా రాష్ట్రాల రాజధానులకు తరలివెళ్లారు. నిన్న మధ్యాహ్నం లోటస్‌పాండ్‌నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ మోహన్‌రెడ్డి విజయవాడకు తరలి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు వైఎస్‌ఆర్‌సిపి నేతలు కూడా ఉన్నారు. ఈ రోజు జరిగే కౌంటింగ్ జగన్ విజయవాడలోని వైఎస్‌ఆర్‌సిపి ఆఫీస్ నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి జగన్ ఫలితాలు చూస్తారని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ సెంటర్స్ వద్ద ఎలాంటి అవాంనీయ సంఘటనలు జరగకుండా సాయుధ భద్రత ఏర్పాటు చేసారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram