కొత్తిమీరతో ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

కొత్తిమీరతో ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

1 ) కొత్తిమీర ఇది చాల వంటకాలలో గార్నిషింగ్ గా ఉపయోగిస్తారు. ఆకుకూరల్లో పచ్చిగా తినే వాటిలో ఇది ఒకటి. చక్కటి సువాసన, కమ్మని రుచి కొత్తిమీర సొంతం. మనం చేసుకునే వంటకాల రుచుని అధికం చేస్తుంది.

2 ) కొత్తిమీర లో ఖనిజ పదార్థాలు, ఇనుము, విటమిన్ – బి,  విటమిన్ – సి, సోడియం చాల అధికంగా ఉంటాయి. అందుకీ మనకు ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.

కొత్తిమీర రసం వల్ల ఆరోగ్యానికి చాల లాభాలు ఉన్నాయి

3 ) డయేరియా తో బాధపడే వారికీ ఈ రసం మంచి మందులగా ఉపయోగపడుతుంది.

4 ) కొత్తిమీర రసంలో ఉండే ప్రత్యేకమైన గుణాలు చర్మ సమస్యలను ప్రధానంగా మొటిమలు, నల్లటి మచ్చలను దూరం చేస్తుంది.

5 ) కొత్తిమీర లో ఉండే శక్తివంతమైన ఆంటియాక్సిడెంట్ శరీరంలో ఉండే హానికరమైన కొవ్వు పదార్థాల స్థాయిని తగ్గిస్తాయి.

6 ) ఇది ధమనులు మరియు సిరల గోడలపై ఉండే కొవ్వుని కరిగిస్తుంది. అకస్మాత్తుగా వచ్చే గుండె జబ్బుల్ని, అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటుని నివారిస్తుంది.

7 ) ఇందులో శరీరానికి అవసరం అయ్యే నూనెలు రక్తంలోని మధుమేహ స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు, కొత్తిమీర తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram