హైదరాబాద్ లో చూడవలసిన ప్రదేశాలు

హైదరాబాద్ లో చూడవలసిన ప్రదేశాలు

తెలంగాణలో ఉండే పర్యాటక ప్రాంతాలలో తప్పకుండ హైదరాబాద్ చూడాల్సిన ప్రదేశం. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడ ఉండే బిర్యానీ. ఇక్కడ బిర్యానీ మాత్రమే కాకుండా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు, చాల పర్యాటక ప్రదేశాలు, జూ పార్కులు, ఆలయాలు, నిజాం ల ప్యాలస్ లు మరియు రామోజీ ఫిలిం సిటీ లు కూడా ఉన్నాయ్.

ఇంకా చెప్పాలి అంటే మనం ఎవరిని అడిగిన ముందుగా వాళ్ళు చెప్పేది చార్మినార్, గోల్కొండ కోట, బిర్లా టెంపుల్ అంటారు ఇవే కాకుండా చాల ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం


1 ) గోల్కొండ కోట: ఒక పురావస్తు శిలా

గోల్కొండ కోటను మహమ్మద్ కూలి కుతుబ్ షా నిర్మించారు. ఈ గోల్కొండ కోట నిర్మాణం ఎత్తు 400 అడుగులు కలిగి ఉంటుంది. ఈ చారిత్రక కట్టడాన్ని చూడటానికి చాల యాత్రికులు వస్తుంటారు. ఈ కోట చక్కని నిర్మాణ శైలికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గోల్కొండ కోట హైదరాబాద్ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరం లో ఉంది. హైదరాబాద్ కి వచ్చే వారికీ ఇది ఒక ఉత్తమ ప్రదేశం అని చెప్పుకోవచ్చు.


Location: ఖైర్ కాంప్లెక్స్, ఇబ్రహీం బాహ్, హైదరాబాద్, తెలంగాణ 500008
Timings: 9 am to 5.30 pm – ప్రతిరోజు

2 ) బిర్లా మందిర్:

ఈ బిర్ల మందిరాన్ని స్వామి రంగనాథ అనే అతను నిర్మించాడు. ఇతను రామకృష్ణ మిషన్ కు సంబందించినవాడు. బిర్లా మందిర్ 280 అడుగుల ఎత్తు పైన ఒక చిన్న కొండ(నౌబథ్ పహాడ్) పై నిర్మించారు. బిర్లా మందిర్ లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.ఈ నిర్మాణాన్ని నిర్మించడానికి దాదాపుగా 2000 టన్నుల పాలరాయిని వాడారు. మనస్సుకు ప్రశాంత కలిగించే విధంగా తెల్లని పాలరాయి రాళ్లతో కట్టడం వల్ల సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇది సుమారుగా 13 ఎకరాలలో ఉంటుంది.


Location: Hill Fort Rd, Ambedkar Colony, Khairatabad, Hyderabad, Telangana 500004
Timings: Monday to Sunday – 7 AM to 12 Noon; 3 PM to 9 PM

3 ) చిలుకూరు బాలాజీ టెంపుల్:

చిలుకూరు బాలాజీ టెంపుల్ని వీసా బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ మొక్కితే తొందరగా వీసా వస్తుంది అని చాల మంది భక్తుల నమ్మకం. శ్రీ వెంకటేశ్వరా స్వామి ని దర్శించుకోవడానికి ఇక్కడి ప్రజలే కాకుండా, చుట్టూ పక్కల ప్రదేశాల వాళ్ళు కూడా వస్తారు. ఈ టెంపుల్ వారాంతాల్లో కూడా చాల రద్దీగా ఉంటుంది.

 

4) చార్మినార్: ఒక అద్భుతమైన మైలురాయి హైదరాబాద్ కి

హైదరాబాద్ కి వచ్చిన ప్రతి పర్యాటకులు చార్మినార్ ని తప్పకుండ సందర్శిస్తారు. హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలలో చార్మినార్ ముఖ్యమైనది. దీనిని క్రి.ష 1951 లో ముహమ్మద్ కూలి కుతుబ్ షా నిర్మించారు. ఫుడ్ లవర్స్ కి చార్మినార్ ఒక మంచి మరియు ముఖ్యమైన ప్లేస్ అనుకోవచ్చు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాల బాగుంటాయి. ఇంకా దీనికి దగ్గర్లో లాడ్ బజార్ కూడా ఉంది అది షాపింగ్ కి చాల ప్రశింద్దమైనది మరియు అలాగే మక్కా మసీద్ ని కూడా చూడవచ్చు.


Location: Char Kaman, Ghansi Bazaar, Hyderabad, Telangana 500002
Timings:  Monday to Sunday -  9:30 AM to 5:30 PM

5 ) నెహ్రు జూలాజికల్ పార్క్:

నెహ్రు జూలాజికల్ పార్క్ ని 1959 వ సంవత్సరంలో నిర్మించారు, ఈ పార్క్ మొత్తం దాదాపుగా 380 acrs కలిగి ఉంటుంది. ఆసియాలో ఉన్న పెద్ద జూ పార్క్ లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సుమారుగా 1500 రకాల జాతుల జంతువులూ నివాసం కలిగి ఉన్నాయి.

 

Location: Zoo Park Main Road, Kishan Bagh, Bahadurpura, Hyderabad
Timings: Tuesdays to Sunday – 8.30 AM to 4.30 PM; Closed on Mondays
Entry Fee: INR 20 per adult; INR 10 per child

6) హుస్సేన్ సాగర్ లేక్: హైదరాబాద్ ఆభరణము

నిత్యం ఇక్కడికి సాయంత్ర సమయాల్లో చాల మంది స్థానికులు మరియు సందర్శకులు అక్కడ ఉండే ప్రశాంత వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. హుస్సేన్ సాగర్ లేక్ అనే నేమ్ దాన్ని నిర్మిచిన హజ్రత్ హుస్సేన్ షా అనే పేరు మీదుగా వచ్చింది. ఈ లేక్ మధ్యలో 32 అడుగుల ఎత్తున్న బుద్దుడి విగ్రహం కూడా ఉంది. ఆ బుద్దుడి దగ్గర వరకు మనం బోటింగ్ కూడా చేయవచ్చు.

 

7) సాలార్ ‌జంగ్ మ్యూజియం:

ఇండియాలో ప్రఖ్యాతిగాంచిన 3 పెద్ద జాతీయ మ్యూజియం లో ఇది కూడా ఒకటి. ఇక్కడ “ఏనుగు దంతాల కళాకృతులు”, “చలువరాతి శిల్పాలు” కలిగి ఉన్నాయి. ఇవే కాకుండా వేరే దేశాలకి  జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా) సంబంధించిన శిల్పాలు,  బొమ్మలు, చేతివ్రాతలు, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఇక్క  ఉన్నాయి.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram