మారిపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి?

మారిపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి?

2014 ఎన్నికలు ముగిసిన తర్వాత వైస్సార్సీపీని వదిలి తెలుగు దేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు చెప్పిన ముచ్చట. నిజానికి జగన్ ప్రస్తుతం ఉంటున్న తీరు వారు చెప్పేదానికి ఎక్కడా పోలిక కుదరడం లేదు. ఇక విషయానికి వస్తే ఈరోజు నూతన మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ఈ మంత్రిమండలిలో 25 మందికి జగన్ మోహన్ రెడ్డి చోటు కల్పించబోతున్నారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరితో జగన్ గారు భేటీ అయ్యారు. గడిచిన పదేళ్ల నుండి తన వెన్నంటే ఉన్నారని కాస్త భావోద్వేగానికి గురయ్యారు. అదేకాకుండా ఎమ్మెల్యేగా ఎన్నికైనవారిలో అన్ని చూసాకే మంత్రి పదవులను ఇస్తున్నాను అని జగన్ తెలిపారు. గెలిచినా 151 మందిలో అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం కుదరదు అని తెలుసు. రెండున్నరేళ్లపాటు 25 మందికి, ఆతర్వాత మరో రెండున్నరేళ్లపాటు మరో 25 మందికి ఇలా ఇవ్వడం ద్వారా 50 మందికి మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతుంది అని జగన్ చెప్పాడు.

 

ఇది ఇలా ఉంటే మంత్రి పదవులు రానివారు నిరాశ కి గురి కావద్దనీ, వాళ్ళ పాత్రా మాత్రం పార్టీలో కీలకం కాబోతుంది అని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని నాయకులు సంబర పడుతున్నారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram