F2 సరికొత్త రికార్డు

F2 సరికొత్త రికార్డు

కథ, కథనంలో దమ్ము ఉండాలేగానీ కాసుల వర్షాన్ని ఎవరూ ఆపలేరు.టికెట్ కొన్న ప్రేక్షకుడు తాను వెచ్చించిన సమయానికి, డబ్బుకి సంతృప్తి చెందాలంటే కడుపుబ్బా నవ్వించడమో, మనసుకి హత్తుకొనే కథాంశంతో మెప్పించడమో చేయాలి. లేకపోతే ఈరోజుల్లో సినిమాలు ఆడవు. సరిగ్గా ఈ విషయాన్ని పసిగట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాడు.

సరికొత్త రికార్డు :

ఇక విషయానికొస్తే విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎఫ్ 2. ఈ సినిమా విడుదలై 16 రోజులు పూర్తయినా ప్రజాధారణ కొంచెం కూడా తగ్గట్లేదు. సంక్రాంతి బరిలో వచ్చిన మిగతా సినిమాలు సరిగా ఆడకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్బులో చేరిన ఈ సినిమా ఇదే జోరు కొనసాగిస్తే 150 కోట్ల క్లబ్బులో చేరుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. నైజాం, సీడెడ్, ఆంధ్రా, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్లా డిస్ట్రిబ్యూటర్స్ కి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం టోటల్ షేర్ 70 కోట్లకు చేరింది. తెలుగు సినిమా హిస్టరీలో మీడియం బడ్జెట్ తో రూపొంది ఇంత పెద్ద మొత్తంలో షేర్ రాబట్టిన తొలి చిత్రంగా ఎఫ్2 సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram