ఫ్లాష్ ఫ్లాష్ ఆగస్టు నెలలో 4లక్షల ఉద్యోగాలు

ఫ్లాష్ ఫ్లాష్ ఆగస్టు నెలలో 4లక్షల ఉద్యోగాలు

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్స్ లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ. ‘ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికే డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం అని అన్నారు. ఆగస్టు నెల 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్ తెలిపారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తాం అని అన్నారు. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం అని తెలిపారు. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేవరకు గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు
ఎవరికైనా అందకపోయినా, పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేయవచ్చు అని తెలిపారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram