ఈ డైరెక్టర్ మళ్ళీ రీమేక్నే నమ్ముకున్నాడు

ఈ డైరెక్టర్ మళ్ళీ రీమేక్నే నమ్ముకున్నాడు

తెలుగు సినీ పరిశ్రమలో కథల కొరత ఉందని విమర్శకులు ఎద్దేవా చేస్తుంటారు. విమర్శకుల మాటల్ని తిప్పికొడుతూ కొత్త దర్శకులు విభిన్న కథాంశాలతో దూసుకొస్తూ హిట్లు కొడుతున్నారు. జాతీయ అంతర్జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం మళ్ళీ రీమేక్‌ల వైపే మొగ్గు చూపుతున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్..? ఏమిటా  సినిమా…  ?

తమిళ సినిమా..తెలుగులో రీమేక్ మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా హరీష్ శంకర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడు తమిళనాట సెన్సేషనల్ హిట్ గా నిలిచిన జిగర్తాండ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ‘F2’తో సూపర్ సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తమిళ వెర్షన్‌లో బాబీ సింగ్ విలన్‌గా నటించి మెప్పించిన పాత్రని, తెలుగు వెర్షన్ లో వరుణ్ తేజ్ చేస్తున్నట్టు సమాచారం. వాల్మికి అనే పేరుతొ ఈ మూవీ పోస్టర్ ఇటీవల విడుదలైంది. బాలీవుడ్ దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా మలిచి తెలుగు జనాల్ని మెప్పించి, సరికొత్త రికార్డులు సెట్ చేసిన హరీష్ శంకర్ ‘జిగర్తాండ’ను ఏ విధంగా తీర్చిదిద్దుతాడో వేచి చూడాలి.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram