ఇండియాలో హనీమూన్ ప్రదేశాలు

ఇండియాలో హనీమూన్ ప్రదేశాలు

హనీమూన్ అనగా తియ్యని వెన్నల అని అర్థం. కొత్తగా పెళ్ళయిన వధువరులు ఉల్లాసంగా గడపడానికి కొన్ని రోజులపాటు అందమైన ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు. ఈ కొత్తగా పెళ్ళయిన వధువరులు ఒక్కటవడానికి జరుపుకునే తొలి ఉల్లాస యాత్రని హనీమూన్ అంటారు. హనీమూన్ కోసం విదేశాలకి వెళ్లాల్సిన అవసరంలేదు మన ఇండియాలో ఈ ప్రేమపక్షులు విహరించే హనీమూన్ ప్రదేశాలు చాలా వున్నాయి. అందులో కొన్ని హనీమూన్ ప్రదేశాలు:

శ్రీనగర్: భూమిపైన స్వర్గం

జమ్ము కాశ్మీర్ యొక్క  రాజధాని శ్రీనగర్. కాశ్మీర్ లోయలో, జీలం నది ఒడ్డున ఈ శ్రీనగర్ ఉంది. ఈ నగరం సరస్సులకు వాటిలో తేలియాడే పడవ ఇళ్ళకు, మొఘల్ ఉద్యానవనాలకి చాల ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఇక్కడ చలి కాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ లోకి వెళ్తాయి. ఇక్కడ ఉండే కొండలు, సరస్సులు, పర్వతాలు ఈ ప్రకృతి అందాలు కొలువైన ఈ ప్రాంతం మిమ్మల్ని ఇంకా రొమాంటిక్ గా చేస్తుంది.

గోవా:

సాధారణ పర్యాటకులకే కాకుండా గోవా హనీమూన్ జంటలకు కూడా బాగుంటుంది. ఇక్కడ ఉండే బీచెస్, వాతావరణం మిమ్మల్ని మరింత రొమాంటిక్ గా మార్చేస్తుంది.

కూర్గ్:

హనీమూన్ జంటలు ఒకరికొకరు అర్తం చేసుకోవడానికి కూర్గ్ ఒక మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఈ కూర్గ్ ని స్కాట్లాండ్ అఫ్ ఇండియా అని కూడా అంటారు.

లక్షద్వీప్:

లక్షద్వీప్ ఒక ఏకాంత ప్రదేశం. ఇక్కడ హనీమూన్ జంటలు పరిపూర్ణ క్షణాలు ఆనందించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉండే నీటి గేమ్స్ స్కూబాడైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్ మరియు ధైర్యసాహసాలతో కూడుకున్న సముద్రంలో నైట్ వాయేజ్ వంటి జలక్రీడలు పర్యాటక ఆకర్షణలో ముఖ్యమైనవి.

ఊటీ:

నీలగిరి పర్వతాలలో ఉన్న అందమైన పట్టణం ఈ ఊటీ. ఇది క్వీన్ అఫ్ హిల్ స్టేషన్ గా పేరుగాంచింది. ఇక్కడ బొటానికల్ గార్డెన్స్, కాఫీ తోటలు, దోడబెట్టా శిఖరాలు, ఊటీ లేక్ ఎలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

మున్నూర్:

ఇది పచ్చని కొండలు మరియు అద్భుతమైన ప్రదేశాలకు నిలయం. మున్నార్ హనీమూన్ కి హాట్ స్పాట్ అని ఎలాంటి సందేహం లేకుండానే చెప్పుకోవచ్చు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram