
చంద్రబాబు ఇచ్చే 3 వేలకు మోసపోకండి
వైఎస్ఆర్సిపి అధినేత జగన్ ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయం అని నిప్పులు చెరిగి, అవినీతిని అడ్డుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా గాని చంద్రబాబు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
చంద్రబాబు చేసే అవినీతులపై ఎం మాట్లాడని పవన్ కళ్యాణ్ కేవలం నన్ను మాత్రమే తిడుతున్నాడు. ఇలాంటి కుట్రలు ఇంకా చాలా బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దని మరో 20 రోజులు ఓపిక పడితే జగన్ సీఎం అవుతాడని అందరికీ తెలియజేయండి. రుణాలు మాఫీ కాలేదని ప్రతి ఒక్కరికీ చెప్పి, ఆ అప్పులన్నింటినీ నాలుగు దఫాలుగా తీర్చేస్తామని కూడా అందరికీ చెప్పండి అని జగన్ తెలిపారు.