కెసిఆర్ సారు, కింగ్ ఫిషర్ బీర్ దొరకట్లేదు

కెసిఆర్ సారు, కింగ్ ఫిషర్ బీర్ దొరకట్లేదు

బయట చుస్తే మండేంత ఎండ కొంచెం రిలాక్స్ అవ్వుదాం అని మద్యం షాప్ కి వెళ్తే “నో బీర్స్” అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి తెలంగాణలో. బీర్ల ఉత్పత్తికి నీటి సరఫరా తగినంతగా లేని యెడల బీర్ల తయారీ చాల వరకు తగ్గిపోయింది. రోజు 2.5 లక్షల కేసుల బీర్ బాటిల్ లను ఉత్పత్తి చేసే కంపెనీలు ఇప్పుడు కేవలం 1.5 లక్షల బీర్ కేసులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక్కో వైన్‌ షాపుకి 25 నుండి 30 బీర్ కేసులను మాత్రమే సరఫరా చేస్తున్నాయి.

 

ప్రస్తుతం ఉన్న సందర్భంలో కావాల్సిన బీర్ దొరకడం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటె జగిత్యాల జిల్లా వాసి ఏకంగా సీఎం కెసిఆర్ కి లేఖ రాసాడు కింగ్ఫిషర్ బీర్లు దొరకడం లేదు అని. జగిత్యాల జిల్లా నుండి కరీంనగర్ జిల్లా కి వెళ్లి తాగుతున్నాం అని, జగిత్యాల ని కూడా కరీంనగర్లో విలీనం చేయాలి అని అందులో రాసాడు.

 

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram