మహర్షి మూవీలోని రైతు డైలాగ్స్

మహర్షి మూవీలోని రైతు డైలాగ్స్

మహేష్ బాబు 25వ సినిమా అయినా మహర్షి మంచి సూపర్ హిట్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్‌, రైతు, సీఈవో‌గా మూడు పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన రైతు డైలాగ్స్ మాత్రం ఈ సినిమాకి ప్రధానంగా నిలిచాయి..

మరి అవేంటో ఒక్కసారి చూద్దామా…!!

  • గవర్నమెంట్‌ అంటే ఎవరు? మనం కాదా? రైతు కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ మాత్రమే కాదు మనందరిదీ నాతో సహా….
  • వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలంలో దిగినంత ఈజీ కాదు సార్‌.. ఇట్స్ ఏ బ్యూటిఫుల్‌ రిలేషన్‌ ఈజ్‌ మేన్‌ అండ్‌ ఎర్త్‌. సైన్‌టిస్ట్‌లకు కూడా అర్థం కానీ సైన్స్‌ సార్‌ ఇది. అర్థం చేసుకునేది రైతు ఒక్కడే.
  • రైతు ఆత్మహత్య చేసుకోవడం కూడా మనకు పట్టడంలేదు. అది రోజూ పేపర్‌లో మామూలు న్యూస్‌ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివాల్ల వచ్చే నష్టమేంటో కూడా మనకు తెలియట్లేదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు. తినేవాళ్లు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్‌లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇది ఇలాగే ఉంటే.. రేపు మీ పిల్లలకు ఇచ్చే ఆస్తి.. వాళ్ల ఆసుపత్రి ఖర్చులకు కూడా సరిపోవు.
  • భూమి విలువ పెరిగిపోతుంది. రైతు విలువ తగ్గిపోతుంది. భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్‌లు కట్టుకుంటూ పోతే… మనం ఏం తిని బతుకుతాం? అందుకే ఏ రైతూ తన కొడుకుని రైతుని చెయ్యాలనుకోవట్లేదు.
  • మనకు రెండు సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైక్‌లు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తను నమ్ముకున్న పంటమీద లాభం వచ్చినా రాకపోయినా మళ్లీ మళ్లీ పంటపండించాలనే ఆశతో తను వేసిన విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటాడు. అలాంటి రైతూ మనం ఒకటే ఎలా అవుతాం సార్‌..
  • పొద్దున్నే లేచి బ్రెడ్‌ జామ్‌ తినే కోటేశ్వరుడు దగ్గర నుంచి గంజి తాగే పేదోడు వరకూ బతకడానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కడికీ వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసే రైతుతో సంబంధం లేకుండా బతుకుతున్నాం..
  • ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. మరి రైతు ఏడిస్తే దేశానికి ఏం మంచి జరుగుతుంది.
About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram