నడుము నొప్పిని తగ్గించుకోవడం ఎలా?

నడుము నొప్పిని తగ్గించుకోవడం ఎలా?

నేటి కార్పొరేట్ జీవితంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో బ్యాక్ పెయిన్ సమస్య కూడా ఒకటి. ఇది వచ్చేందుకు చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో ప్రధాన కారణం, పోషకాహార లోపం. విటమిన్ డి తగినంత లేకపోయినా బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే కొందరిలో బ్యాక్‌పెయిన్ సమస్య చాల తీవ్రంగా ఉంటుంది. మరికొందరిలో ఈ సమస్య చాల తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకుంటే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి విటమిన్ డి ఉన్న ఆహారాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందామా..!

1. చేపలు

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చాల అధికంగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ డి కూడా మనకు వాటిల్లో లభిస్తుంది. కావున చేపలను వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు తీసుకోవడం వల్ల విటమిన్ డి శరీరానికి సరిగ్గా అందుతుంది. దీంతో ఎముకలు దృఢంగా మారి బ్యాక్ పెయిన్, కీళ్ల నొప్పులు రావడం వంటివి రావడం తగ్గుతాయి.

2. పాలు

పాలలో అధికంగా విటమిన్ డి, కాల్షియం ఉంటాయి. పాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బ్యాక్ పెయిన్, ఇతర నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు.

3. కోడిగుడ్లు

కోడిగుడ్లలో నిత్యం మన శరీరానికి కావల్సిన విటమిన్ డి 6 శాతం వరకు లభిస్తుంది. అయితే కోడిగుడ్డు లోని పచ్చసొనను మాత్రం పడేయకూడదు. అందులోనే విటమిన్ డి మనకు అధికంగా లభిస్తుంది. పచ్చసొనను కూడా తింటేనే విటమిన్ డి ని అధికంగా పొందగలుగుతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ సమస్య నుంచి హాయిగా ఉపశమనం లభిస్తుంది.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram