తేజ నువ్వే కాపాడాలయ్యా

తేజ నువ్వే కాపాడాలయ్యా

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు తయారయ్యింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిస్థితి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీనివాస్, ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయాడు. మొదటి సినిమా నుంచీ అగ్ర దర్శకులు, టాప్ హీరోయిన్స్, ప్రముఖ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేస్తున్నప్పటికీ కథా బలం లేకపోవడం వల్ల బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతున్నాడు. ఎంత పలుకుబడి, పెట్టుబడి ఉన్నా హిట్స్ లేకపోతే సినీ పరిశ్రమలో మనుగడ ఉండదు కాబట్టి విజయం తప్పనిసరి అయింది. తదుపరి చిత్రం లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. ఆ సినిమా పేరు ‘సీత’.

తేజ దర్శకత్వంలో.. :

తెలుగు సినీ పరిశ్రమకి సెన్సేషనల్ హిట్స్ అందించి, కొన్నాళ్ళు ప్లాపులతో  సతమతమై మళ్ళీ నేనే రాజు నేనే మంత్రి మూవీతో ఫామ్ లోకి వచ్చిన తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. కాజల్, శ్రీనివాస్ ల డిఫరెంట్ హావభావాలతో విడుదలైన ‘సీత’ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ భవిష్యత్తు తేజ చేతిలో ఉన్నట్లు అర్ధమవుతుంది.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram