తెలంగాణ నూతన ఎంపీలు వీరే

తెలంగాణ నూతన ఎంపీలు వీరే

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మాత్రం చాల అనూహ్యంగా వచ్చాయి.. ముందుగా పదహరు స్థానాలను సొంతం చేసుకోవాలని కలలు గన్న టీఆర్ఎస్ కి ఈ సారి గట్టి దెబ్బే తగిలింది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా 17 స్థానాలలో టీఆర్ఎస్ తొమ్మిది స్థానాలను, కాంగ్రెస్ మూడు స్థానాలను, బీజేపి నాలుగు స్థానాలను, ఎంఐఎం ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలిగాయి. మరి ఎవరెవరు ఎన్ని ఓట్ల మెజారిటీ తో గెలిచారో చూద్దాం ఒకసారి.

1 ) హైదరాబాద్‌: ఎంఐఎం
అసదుద్దీన్‌ ఒవైసీ 2,82,186 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి భగవంతరావు పై విజయం సాధించారు.
2 ) సికింద్రాబాద్‌: భాజపా
కిషన్‌రెడ్డి (భాజపా) 62,114 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ పై విజయం సాధించారు.
3 ) మల్కాజ్‌గిరి: కాంగ్రెస్
రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్) 10,919 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి పై విజయం సాధించారు.
4 )చేవెళ్ల: తెరాస
గడ్డం రంజిత్‌రెడ్డి(తెరాస) 14,772 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పై విజయం సాధించారు.
5 ) మెదక్‌: తెరాస
కొత్త ప్రభాకర్‌రెడ్డి(తెరాస) 3,16,427 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ పై విజయం సాధించారు.
6 ) మహబూబాబాద్‌(ఎస్టీ): తెరాస
మాలోతు కవిత(తెరాస) 1,46,663 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాం నాయక్‌ పై విజయం సాధించారు.
7 ) పెద్దపల్లి(ఎస్సీ): తెరాస
వెంకటేశ్‌ నేత(తెరాస) 95,180 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై విజయం సాధించారు.
8 ) జహీరాబాద్‌: తెరాస
బి.బి.పాటిల్‌(తెరాస) 6,229 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మదనమోహనరావు పై విజయం సాధించారు.
9 ) నిజామాబాద్‌: భాజపా
ధర్మపురి అర్వింద్‌(భాజపా) 71,057 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థిరాలు కె.కవిత పై విజయం సాధించారు.
10 ) మహబూబ్‌నగర్‌: తెరాస
మన్నె శ్రీనివాసరెడ్డి(తెరాస) 77,829 ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థిరాలు డీకే అరుణ పై విజయం సాధించారు.
11 ) ఆదిలాబాద్‌(ఎస్టీ): భాజపా
సోయం బాపురావు(భాజపా) 58,493 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి గోడెం నగేశ్‌ పై విజయం సాధించారు.
12 ) నాగర్‌కర్నూల్‌(ఎస్సీ): తెరాస
పి.రాములు(తెరాస) 1,89,748 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి పై విజయం సాధించారు.
13 ) వరంగల్‌(ఎస్సీ): తెరాస
పసునూరి దయాకర్‌(తెరాస) 3,50,298 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య పై విజయం సాధించారు.
14 ) నల్గొండ: కాంగ్రెస్
ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్) 25,682 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పై విజయం సాధించారు.
15 ) ఖమ్మం: తెరాస
నామా నాగేశ్వరరావు(తెరాస) 1,68,062 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిరాలు రేణుకా చౌదరి పై విజయం సాధించారు.
16 ) కరీంనగర్‌: భాజపా
బండి సంజయ్‌(భాజపా) 89,508 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ పై విజయం సాధించారు.
17 ) భువనగిరి: కాంగ్రెస్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి(కాంగ్రెస్) 5,219 ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ పై విజయం సాధించారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram