వైరల్ అవుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్-3 న్యూస్

వైరల్ అవుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్-3 న్యూస్

బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లు పూర్తిచేసుకుంది. ఆ రెండు సీజన్లు కూడా బుల్లి తెర అభిమానులను అలరించాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సీజన్ కన్నా సెకండ్ సీజన్ అంత హిట్ అవ్వలేక పోయింది.
తొలి సీజన్కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా . రెండో సీజన్ కు నాని హోస్ట్ గా ఉన్నారు. బిగ్ బాస్ తొలి సీజన్ కు 70 రోజుల గడువు పెట్టి, 16 మంది సభ్యులతో. రెండో సీజన్ కు మాత్రం 112 రోజుల గడువును పెట్టి, హౌజ్ మేట్స్ ను 18 మంది సభ్యులని తీసుకున్నారు. మరి మూడో సీజన్ కి ఎంత మందిని తీసుకుంటారు? ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలి ? అనే విషయం ఇంకా క్లారిటీగ తెలియనప్పటికీ.. బిగ్ బాస్ సీజన్ 3 కోసం ఇదివరకే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సీజన్ 3కి హోస్ట్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున గారిని ఎంపిక చేసిన సంగతి మనకు తెలిసిందే.

 

మరి ఈ సీజన్ 3 లో ఎవరెవరు ఉన్నారో ఒక లుక్ వేద్దామా….. 

 

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, యాంకర్ ఉదయభాను, యూట్యూబ్ స్టార్ మహాతల్లి, నటుడు జాకీ, నటుడు కమల్ కామరాజ్, నటి గాయత్రీ గుప్తా, యాంకర్ సావిత్రి, మోడల్ సింధూర గద్దే, జబర్దస్త్ ఫేం పొట్టి గణేశ్, సింగర్ హేమచంద్ర, డ్యాన్స్ మాస్టర్ రఘు వీళ్ళు కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటె హౌజ్ లోకి సర్ ప్రైజ్ స్టార్స్ గా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రావడం జరుగుతుంది అంట.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram