ఛలో ఒకసారి గోవా అందాలని చూసొద్దాం రండి

ఛలో ఒకసారి గోవా అందాలని చూసొద్దాం రండి

ఇండియాలో ఉన్న పేరుగాంచిన పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. ఇది కేవలం మన ఇండియా టూరిస్ట్ లనే కాకుండా విదేశీ టూరిస్టులను ఆకర్షించండం దీని ప్రత్యేకత. ఫ్యామిలీ తో అయినా స్నేహితులతో అయినా అందరికి అనుకూలించే ప్రదేశం ఇది.

మన ఇండియాకి ఇది పశ్చిమ తీరభాగంలో అరేబియా సముద్రానికి దగ్గరలో ఇది ఉంది. దీనిని “కొంకణా తీరం అని కూడా అంటారు.దీని రాజధాని పనాజీ. ఈ గోవాకి ఉత్తరభాగాన మహారాష్ట్ర మరియు తూర్పు , దక్షిణ బాగాలకి కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.

16వ శతాబ్దంలో పోర్చుగీసు వాళ్ళు గోవాలో స్థావరం ఏర్పరచుకున్నారు. చాల కొద్దీ కాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకోగలిగారు. గోవా అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి అక్కడి బీచ్లు, కొబ్బరి తోటలు, ప్రత్యేకమైన కట్టడాలు మరియు చర్చిలు.

ఈ గోవాలో 125కి .మీ పొడవునా సముద్ర తీరాలు విస్తరించి ఉన్నాయి. వీటిని ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజన చేసారు. ఉత్తరభాగం పార్టీలు, కార్నివల్స్, స్కూబా డైవింగ్, వాటర్ స్కూటరింగ్లకి పెట్టింది పేరు అయితే ..  ప్రశాంతంగా గడిపేందుకు దక్షిణ గోవా బీచ్లను కేరాఫ్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన యాత్రికులు ఉదయం, రాత్రి అని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇక్కడ బైక్స్ ని కూడా అద్దెకు ఇస్తారు ధర ౩౦౦-500 మించి ఎక్కువ ఉండదు. చాల తక్కువ మనీ తో రోడ్స్ కి  ఇరువైపులా దుకాణాలలో ట్-షర్ట్స్, కూలింగ్ గ్లాస్సెస్ వంటివి అమ్ముతారు. సెలవుదినం లేదా సాయంకాలాల్లో చాల ఎక్కువ మంది జనాలు బీచ్లకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కండోలిం దగ్గర్లోనే  కండోలిం బీచ్, కాలాగుటే బీచ్ మరియు బాగా బీచ్ లు ఉన్నాయి.  కాలాగుటే బీచ్ మరియు బాగా బీచ్ లు పక్క పక్కనే ఉంటాయి. బీచ్ దగ్గర్లో ఉండే గుడిసెలలో సిఫుడ్, బీర్లు మరియు హుక్కా లభిస్తాయి. అక్కడ ఉండే వాతావరణానికి ఒక్క బీర్ పుచ్చుకుంటే బాగా ఎంజాయ్ చేయవచ్చు.  సాయంత్రం అయింది అంటే చాలు ఇక్కడ అన్ని ప్రాంతాలు నైట్ క్లూబ్లు, పబ్ లు ఉండి తెల్లవారు జామున 2 -3 గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది.

కాలాగుటే బీచ్ కి 20 కి.మీ దూరం లో  పాంజిం ప్రాంతం ఉంటుంది. ఇది చాలా బిజీగా ఉండి షాపింగ్ బాగా చేస్కోవచ్చు. ఇక్కడ ఉండే నైట్ లైఫ్, బీచ్ లు, పార్టీలు అన్ని దేశంలోని ఇతర పట్టణాల కంటే కూడా చాల తక్కువ ఖర్చులోనే అందిస్తూ దేశీయ పర్యాటకులను స్వాగతిస్తాయి. ఈ పాంజిం ప్రాంతం లో కేసినో ఉంటుంది దీని ఎంట్రన్స్ ధర 2500 /- డైలీ డేస్ లో ఉండి.. వీకెండ్స్ లో మాత్రం ౩౦౦౦/- ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంత చెప్పిన చాలా తక్కువ గోవా గురించి.

 

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram