ఇకపై అమెరికా హెచ్‌1బీ వీసా వచ్చేనా??

ఇకపై అమెరికా హెచ్‌1బీ వీసా వచ్చేనా??

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రోజులు గడిచిన కొద్దీ హెచ్-1బీ వీసా ఎంతగానో కఠినంగా చేస్తున్న తరుణం తెలిసిందే. అమెరికాలో పనిచేసేందుకు భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపకరించే హెచ్‌1బీ వీసాల ఆమోదం 2018లో పది శాతం తగ్గిందని అమెరికన్‌ అధికారులు వెల్లడించారు.

2018 సంవత్సరానికి రెన్యూవల్స్‌ సహా కలిపి కేవలం 3,35,000 హెచ్‌1బీ వీసాలను మంజూరు చేసినట్లు USCIS లెక్కలు చెబుతున్నాయి. ఇవే వీసాలు అంతకు ముందు గణాంకాలు చుస్తే మాత్రం 2017లో 3,73,400 మంజూరు చేశారు. అంటే 2017లో వచ్చిన ప్రతి 100 దరఖాస్తు 93కు ఆమోద ముద్రపడగా.. 2018 నాటికి 85కు మాత్రమే గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. అదే ఏడాది మొదటి ఆరు నెలల్లో నూటికి కేవలం 79 వీసాలను ఆమోదించారు. చివర్లో కొంత జెనెర్వ్స్ ఉండటంతో అది కొంచెం 85శాతానికి చేరింది. 2018లో 8.50లక్షల నేచురలైజేషన్‌ దరఖాస్తులు పరిష్కరించారు.
‘‘హెచ్‌1బీ వీసాల విధానాన్ని తగ్గించాలని ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి రావడం తో జారీకి పెట్టేం వేశారు. ఆ చర్యల పరిణామాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.’’అని మైగ్రేషన్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విశ్లేషకురాలు సారా పెర్సీ చెప్పారు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram