ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

డిజిట‌ల్ మార్కెటింగ్‌లో త‌క్కువ అంచ‌నా వేసే విభాగం ఏదైనా ఉందా అంటే అది ఇమెయిల్ మార్కెటింగే అని చెప్పొచ్చు.

అత్య‌ధిక రిట‌ర్న్ ఆన్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఇచ్చే ఇమెయిల్ మార్కెటింగ్‌పై డిజిట‌ల్ బ‌డి ప్ర‌త్యేక క‌థ‌నం.

ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

సింపుల్‌గా చెప్పాలంటే ఇమెయిల్స్ పంప‌డం. ఒక ఇమెయిల్ ఐడీ నుండి కొంత మందికి ఏదైనా స‌మాచారాన్ని పంపాల‌నుకుంటే మ‌నం జీమెయిల్ వాడ‌తాం. కానీ, ఒకే ఇమెయిల్ ఐడీ నుండి వేల‌, ల‌క్ష‌ల ఇమెయిల్ ఐడీల‌కు స‌మాచారాన్ని ఒకేసారి పంపాలంటే ఒక్క జీమెయిల్ ఐడీతో

పంప‌డం సాధ్యం కాదు. అందుకోసం ప్ర‌త్యేక టూల్స్‌ని వాడ‌డం జ‌రుగుతుంది. అలా టూల్స్ వాడుతూ పంపితే అది ఇమెయిల్ మార్కెటింగ్‌. అయితే, ఎవ‌రికి ఇమెయిల్స్ పంపాలి, ఎందుకు పంపాలి, ఇమెయిల్ మార్కెటింగ్‌ని ఎలా చేయాలి అనేది మ‌నం చూద్దాం.

ఇమెయిల్ ఇంత ఇంపార్టెంటా?

డిజిట‌ల్ మార్కెటింగ్‌కి ఇమెయిల్ ఐడీ చాలా అవ‌స‌రం. అందుకే మీరు ఆన్‌లైన్‌లో ఎక్క‌డికైనా వెళ్ళండి, మీరు మీ ఇమెయిల్ ఐడీని స‌మ‌ర్పించాల్సిందే. ఏ వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ అవ్వాల‌నుకున్నా మీ ఇమెయిల్ ఐడీ అడుగుతారు. డిజిట‌ల్ మార్కెటింగ్‌కి ఇమెయిల్ ఐడీ చాలా ఇంపార్టెంట్‌.

ఇమెయిల్ ఐడీల‌ను కొనొచ్చా?

ఈ ప్ర‌శ్న న‌న్ను చాలా మంది అడుగుతుంటారు. ఇమెయిల్ ఐడీల‌ను కొనొచ్చా లేదా అనేది. ఎందుకంటే మార్కెట్‌లో చాలా మంది ఇమెయిల్ ఐడీల‌ను అమ్ముతున్నారు. ల‌క్ష ఇమెయిల్ ఐడీల‌ను 5000 రూపాల‌య‌కు కావొచ్చు. ఇలా కొన‌డం ఇమెయిల్ మార్కెటంగ్ చేస్తే అది మీ డొమైన్‌కి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంది.  కాబ‌ట్టి, ఇమెయిల్ ఐడీల‌ను కొని ఇమెయిల్ మార్కెటింగ్ చేయొద్దు. మరి ఎలా చేయాలి అనేది చూద్దాం.

ఇమెయిల్ లిస్ట్ నిర్మించడం

మీకు మీరే సొంత ఇమెయిల్ లిస్ట్‌ని నిర్మించుకోవ‌డం అనేది కొంత స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఇది అత్యంత ప్ర‌భావవంతంగా ఉంటుంది అని చెప్పుకోవొచ్చు. క‌న్వ‌ర్ష‌న్ రేట్ కూడా మెరుగ్గా ఉండే అవ‌కాశాలా చాలా ఎక్కువ. ఎందుకంటే వెబ్ సంద‌ర్శ‌కులు వాళ్ళంత‌కు వారే మాకు మీ అప్‌డేట్స్‌ని పంప‌మ‌ని వాళ్ళే మీకు అనుమ‌తి ఇస్తున్న‌ట్టు.

ఇమెయిల్ మార్కెటింగ్‌కి వాడే టూల్స్‌

ఇమెయిల్ మార్కెటింగ్‌కి వాడే టూల్స్ మార్కెట్‌లో చాలానే ఉన్న‌ప్ప‌టికీ, మేము ఎక్కువ‌గా వాడే టూల్స్‌ని మీకు ప‌రిచ‌యం చేస్తాం.  ఎక్కువ శాతం మెయిల్ చింప్ అనే టూల్‌ని వాడ‌తారు. మెయిల్ చింప్‌తో పాటు, మేల‌ర్‌లైట్‌, ఏవెబ‌ర్‌, సెండీ, డ్రిప్ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. మీ ఇమెయిల్ మార్కెటింగ్ యొక్క అవ‌స‌ర‌త‌ను బ‌ట్టి మీరు ఇమెయిల్ మార్కెటింగ్ టూల్‌ని ఎంచుకొని మీరు వాడాల్సి ఉంటుంది. డిజిట‌ల్ బ‌డి అందిస్తున్న ఇమెయిల్ మార్కెటింగ్ కోర్సులో ఇమెయిల్ మార్కెటింగ్‌ని కూడా చేర్చ‌డం జ‌రిగింది. మీరు ఇమెయిల్ మార్కెటింగ్ నేర్చుకోవాల‌నుకుంటే డిజిట‌ల్ బ‌డిని సంప్ర‌దించండి.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram