వాహ్.. విజయదేవరకొండ.. అద్భుతంగా మాట్లాడావ్

వాహ్.. విజయదేవరకొండ.. అద్భుతంగా మాట్లాడావ్

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్ సంపాదించుకోవడమంటే మాటలు కాదు. అలాంటి స్థాయి రావాలంటే ఎంతో కసి, అంతకుమించిన కృషి ఉండాలి. అలా వచ్చిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తన యాటిట్యూడ్‌తో, నిష్కల్మషమైన మాటలతో అందరి మనసులు దోచుకుంటూ తనకొచ్చిన స్టార్ డమ్ ని నిలబెట్టుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఐకాన్ గా మార్మోగుతున్నాడు.

సిగ్నేచర్ బ్రాండ్ అంబాసిడర్ :

సిగ్నేచర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన విజయ్ దేవరకొండ ఇటీవల మీడియా సమావేశంలో చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. తన అడుగులు సినిమా రంగంవైపు పడడానికి గల కారణాలు వివరించాడు. తాను ఎవరినో చూసి, స్ఫూర్తి పొంది సినిమాల్లోకి రాలేదని, తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలే బాగా డబ్బు సంపాదించే ఈ రంగం వైపు వచ్చేలా చేశాయని చెప్పాడు.

                         ‘మనకు లైఫ్ లో డబ్బు కావాలి, ఇంటికి రెంటు కట్టాలి, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో రెస్పెక్ట్ కావాలి. నన్ను మోటివేట్ చేసినవి ఈ సమస్యలే. వాడిలా ఉండాలి, వీడిలా ఉండాలి అని అనుకోకుండా మనం కోరుకున్న జీవితంలోకి ప్రవేశించాలి అనే కసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని’ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ టాలీవుడ్ సెన్సేషన్ తన మాట తీరుతో మరోసారి అందరి హృదయాలు కొల్లగొట్టాడు.

About the Author /

teluguglobalnews69@gmail.com

Post a Comment

#Follow us on Instagram